Chandrababu: స్నేహం, క్రమశిక్షణ అనే పదాలకు అర్థం తెలియని వ్యక్తివి నువ్వొక్కడివే: చంద్రబాబుపై మోహన్ బాబు వ్యాఖ్యలు

  • తనకు క్రమశిక్షణ లేదన్నారంటూ చంద్రబాబుపై మోహన్ బాబు ఆరోపణ
  • ట్విట్టర్ లో స్పందన
  • తన పేరుకు భంగం కలిగించేలా మాట్లాడొద్దంటూ హితవు
ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై సినీ నటుడు మోహన్ బాబు విమర్శనాస్త్రాలు సంధించారు. వరుస ట్వీట్లతో ఆయన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. "చంద్రబాబూ, ఎన్నికలు పూర్తయ్యాయి. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. అంతా ప్రశాంతంగా ఉన్న ఈ తరుణంలో మళ్లీ నా మనసును బాధపెడతావని అనుకోలేదు. రెండ్రోజుల కిందట "క్రమశిక్షణలేని వ్యక్తి మోహన్ బాబు" అని నీ నోటి వెంట రావడం ఆశ్చర్యం కలిగించింది. మరోసారి నా మనసును గాయపరిచావు.

"క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మోహన్ బాబు" అని ఎన్టీఆర్, ఏఎన్నార్ తో పాటు యావత్ చిత్రపరిశ్రమ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇప్పటికీ చెబుతూనే ఉంటారు. ఈ విషయం అందరికీ తెలుసు. క్రమశిక్షణ, స్నేహం అనే పదాలకు అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే అది నువ్వొక్కడివే. దయచేసి ఇకమీదట ఎప్పుడూ నా పేరుకు భంగం కలిగేలా మాట్లాడవద్దు. అది మనిద్దరికీ మంచిది. ఎక్కడైనా ఇద్దరం ఎదురుపడితే సరదాగా మాట్లాడుకుందాం, అది కూడా నీకు ఇష్టమైతేనే" అంటూ మోహన్ బాబు తాను చెప్పాల్సింది ట్విట్టర్ వేదికగా చెప్పేశారు.
Chandrababu
Mohanbabu
Andhra Pradesh
Telugudesam
YSRCP
Tollywood

More Telugu News