Vijayawada: సెల్ టవర్ ఎక్కి మహిళల ఆందోళన.. జగన్ వెంటనే స్పందించాలంటూ డిమాండ్

  • విజయవాడలో నిరుద్యోగ మహిళల ఆందోళన
  • జగనన్నా.. జాబ్ ఇవ్వన్నా అంటూ నినాదాలు
  • సీఎం స్పందించకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ హెచ్చరిక
విజయవాడలో కొందరు మహిళలు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశారు. ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వద్ద పెట్రోల్ బాటిల్ చేత్తో పట్టుకుని సెల్ టవర్ ఎక్కి మహిళా నిరుద్యోగులు నిరసన తెలిపారు. 'జగనన్నా... జాబ్ ఇవ్వన్నా' అంటూ నినాదాలు చేశారు. తమ డిమాండ్ పై ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించాలని... లేని పక్షంలో ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. వారిని సురక్షితంగా కిందకు తీసుకొచ్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. గ్రామ సచివాలయం ఉద్యోగాలు రాని నిరుద్యోగులు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా, కొందరు మహిళలు సెల్ టవర్ ఎక్కారు.
Vijayawada
Women
Protest
YSRCP
Jagan

More Telugu News