motkupally narasimhulu: ఢిల్లీలో అమిత్ షాతో మోత్కుపల్లి భేటీ.. బీజేపీలో చేరేందుకు సుముఖత

  • కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తో కలిసి అమిత్ షాను కలిసిన మోత్కుపల్లి
  • బీజేపీలోకి రావాలని ఆహ్వానం
  • ఓకే చెప్పిన మోత్కుపల్లి
బీజేపీలో చేరేందుకు టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నరసింహులు సుముఖత వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. ఆయన వెంట కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్షణ్ కూడా ఉన్నారు. అమిత్ షాతో భేటీ అనంతరం బీజేపీలో చేరేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు.

కాగా, ఇటీవల కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ కలిసి మోత్కుపల్లి ఇంటికి వెళ్లి ఆయనను బీజేపీలోకి రావాలని ఆహ్వానించిన విషయం తెలిసిందే. మోత్కుపల్లి చేరికతో తెలంగాణలో తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. గతంలో ఆయన టీడీపీలో కీలక నేతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
motkupally narasimhulu
BJP
Telugudesam

More Telugu News