cheddy gang: నిజామాబాద్‌లో విరుచుకుపడ్డ చెడ్డీగ్యాంగ్‌.. కుటుంబాన్ని బెదిరించి బంగారం, నగదుతో పరారు

  • నిన్న అర్ధరాత్రి తర్వాత హల్‌చల్‌
  • 16 తులాల బంగారం, 50 వేల నగదు అపహరణ
  • బాధితుల కేకలతో అప్రమత్తమైన స్థానికులు
చెడ్డీగ్యాంగ్‌ దోపిడీకి పాల్పడింది. నిజామాబాద్ నగర శివారులో నిన్న అర్ధరాత్రి హల్‌చల్ చేసింది. లలితానగర్‌ న్యాల్ కల్ రోడ్‌లోని లలితాంబ ఆలయం సమీపంలో రైతు తిమ్మయ్య  నివాసం ఉంటున్నారు. ఈ ఇంట్లోకి ప్రవేశించిన గ్యాంగ్ కుటుంబ సభ్యులను బెదిరించి వారందరినీ ఓ గదిలో పెట్టి తలుపు వేసేశారు.

అనంతరం ఇంట్లో ఉన్న బీరువాలోని 16 తులాల బంగారం, 50 వేల నగదు ఎత్తుకు పోయారు. గ్యాంగ్‌ సభ్యులు వెళ్లిపోయిన తర్వాత బాధిత కుటుంబ సభ్యులు భయంతో వేసిన కేకలు విని స్థానికులు స్పందించారు. కిటికీలో నుంచి వారిని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దోపిడీ ఘటనపై బాధితుల నుంచి ఆరాతీశారు.
cheddy gang
Nizamabad District
robery

More Telugu News