Pawan Kalyan: విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న పవన్... ఘనస్వాగతం పలికిన కార్యకర్తలు

ఇసుక కొరతకు నిరసనగా నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ ర్యాలీకి నాయకత్వం వహించేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితమే విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు జనసేన నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మరికాసేపట్లో విశాఖలో లాంగ్ మార్చ్ ర్యాలీ ప్రారంభం కానుంది. లాంగ్ మార్చ్ లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. లాంగ్ మార్చ్ జరిగే మార్గంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

కాగా, లాంగ్ మార్చ్ లో పాల్గొనేందుకు వస్తున్న కార్మికులు, జనసేన నేతలు, కార్యకర్తల వాహనాలకు ఆళ్వార్ దాస్ ఇంజినీరింగ్ కాలేజి పీఏ పాలెం క్యాంపస్ లో పార్కింగ్ ఏర్పాటు చేసినట్టు జనసేన ఓ ప్రకటనలో వెల్లడించింది. కార్మికులు, జనసైనికులు తమ వాహనాలను మద్దిలపాలెం సీఎంఆర్ నుంచి పార్కింగ్ ప్రదేశానికి  తీసుకెళ్లాల్సి ఉంటుంది.
Pawan Kalyan
Jana Sena
Long March
Vizag

More Telugu News