Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాబోయే అల్లుడితో అత్త వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న కూతురు

  • జార్ఖండ్‌‌లోని జంషెడ్‌పూర్‌లో ఘటన
  • సన్నిహితంగా ఉన్న తల్లీ, ప్రియుడిని చూసి యువతి షాక్
  • పట్టుకుని పోలీసులకు అప్పగింత
తనకు కాబోయే భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తల్లిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుందో కూతురు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. భర్త చనిపోయిన ఓ మహిళ తన కుమారుడు, కుమార్తెతో కలిసి స్థానికంగా నివసిస్తోంది. డిగ్రీ చదువుతున్న ఆమె కుమార్తె ఓ యువకుడితో ప్రేమలో పడింది. విషయం తెలిసిన తల్లి వారి పెళ్లికి అంగీకరించింది.

తమ పెళ్లికి లైన్ క్లియర్ కావడంతో యువకుడు తరచూ ప్రేయసి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ప్రేయసి తల్లితో ఏర్పడిన చనువు ఆపై వివాహేతర సంబంధానికి దారితీసింది. తాను లేని సమయంలో ప్రియుడు ఇంటికి వచ్చి పోతుండడాన్ని యువతి అనుమానించింది. అతడిపై నిఘా పెట్టింది.

ఓ రోజు కాలేజీ నుంచి ఇంటి కొచ్చిన ఆమెకు బయట ప్రియుడి చెప్పులు కనిపించాయి. లోపలికి తొంగిచూస్తే తన తల్లి, ప్రియుడు సన్నిహితంగా కనిపించారు. దీంతో విస్తుపోయిన ఆమె.. యువకుడి కుటుంబ సభ్యులతోపాటు స్థానికులను అప్రమత్తం చేసి వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం పోలీసులకు అప్పగించింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
jharkhand
jamshedpur
love
Police

More Telugu News