ఎయిరిండియా విమానం రద్దు.. శంషాబాద్‌లో ప్రయాణికుల నిరసన

సమాచారం ఇవ్వకుండా విమానాన్ని రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో  ఎయిరిండియా ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం 9 గంటలకు ముంబైకి వెళ్లాల్సిన ఎయిరిండియా-966 విమానాన్ని రద్దు చేసిన సంస్థ.. రాత్రి 8.40కి మార్చినట్టు ప్రకటించింది. విమానం ఎక్కేందుకు ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత సిబ్బంది ఈ విషయాన్ని చెప్పడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే తీవ్ర నిరసన తెలిపారు. ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో సిబ్బందిని నిలదీశారు.


More Telugu News