KCR: కేసీఆర్ ఏకపాత్రాభినయం బాగుంది: రేవంత్ ఎద్దేవా

  • ఆర్టీసీ హత్యకు కేసీఆర్ పన్నాగం
  • ఏపీ గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడరు
  • ఏపీకున్న పట్టుదల కేసీఆర్ ఎందుకు లేదు?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సాక్షిగా ఏకపాత్రాభినయం బాగానే చేశారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేబినెట్ సమావేశం అనంతరం నిన్న రాత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ విషయంలో ఇతర రాష్ట్రాలను ఉదాహరణలుగా చూపుతున్న కేసీఆర్.. పొరుగునే ఉన్న ఏపీ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఏపీ ప్రభుత్వం చూపుతున్న పట్టుదలను కేసీఆర్ ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీ హత్యకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
KCR
Revanth Reddy
tsrtc
Andhra Pradesh

More Telugu News