ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో విపక్షాలపై ఎదురుదాడికి దిగిన సీఎం కేసీఆర్
- కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం
- ఆర్టీసీ సమ్మెపై చర్చ
- భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్
కేంద్రంలో ఓ విధంగా మాట్లాడుతూ, రాష్ట్రానికొచ్చేసరికి మరో విధంగా మాట్లాడతారా? అని బీజేపీ నేతలపై మండిపడ్డారు. మోటార్ వెహికిల్ చట్టం ఆమోదం పొందడంలో నలుగురు బీజేపీ సభ్యులు కీలకపాత్ర పోషించింది నిజం కాదా? అని కేసీఆర్ నిలదీశారు.
రాజస్థాన్, పంజాబ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా? ఇక్కడకొచ్చి డ్రామాలు ఆడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలపైనా నిప్పులు చెరిగారు. ఇష్టం వచ్చినట్టు ప్లాట్ ఫాం స్పీచ్ లు దంచడం కాదని, తాను అడిగేవాటికి సమాధానం చెప్పాలని అన్నారు.