Andhra Pradesh: ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారం ఐపీఎస్ సురేంద్రబాబుకు అప్పగిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం

  • రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు
  • గ్రామ, వార్డు వాలంటీర్ల విభాగం ఇంఛార్జీగా కె. కన్నబాబు 
  • ఉన్నత విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సతీష్ చంద్ర
  • ఎస్ పీఎఫ్ డైరెక్టర్ జనరల్ గా ఐపీఎస్ అధికారి ఎన్ వి సురేంద్రబాబు  
ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు వెలువరించింది. ఎస్ పీఎఫ్ డైరెక్టర్ జనరల్ గా నియమితులైన ఐపీఎస్ అధికారి ఎన్.వి.సురేంద్రబాబు ఇసుక, అక్రమ తవ్వకాలు, ఎక్సైజ్ వ్యవహారాలు కూడా చూడనున్నారు.

జే ఎస్ వి ప్రసాద్ సాధారణ పరిపాలనశాఖకు రిపోర్టు చేయాలని ఆదేశాలు అందుకోగా, గ్రామ, వార్డు వాలంటీర్ల విభాగం ఇంఛార్జీగా కె కన్నబాబు నియమితులయ్యారు. వెయిటింగ్ లో ఉన్న ఐఏఎస్ అధికారి సతీష్ చంద్రకు నాలుగు నెలల తర్వాత ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈయన విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహించనున్నారు.  మరో ఐపీఎస్ అధికారి త్రిపాఠిని డీజీపీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది.
Andhra Pradesh
IAS
IPS

More Telugu News