PCI: ప్రెస్ కౌన్సిల్ నిర్ణయంతో జగన్ సర్కారు ముఖంపైన లాగిపెట్టి కొట్టినట్టయింది: చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో మీడియా నియంత్రణ కోసం తీసుకువచ్చిన 2430 జీవోపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) దృష్టి సారించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. దుర్మార్గపు జీవో 2430 అంశంపై పీసీఐ సుమోటోగా స్పందించడం ద్వారా జగన్ సర్కారు ముఖంపై లాగిపెట్టి కొట్టినట్టయిందని వ్యాఖ్యానించారు. నిజాలను నిర్భయంగా వెల్లడించే జర్నలిస్టులను, సామాజిక మాధ్యమాల్లో ప్రజా సమస్యలపై గళం విప్పే సామాన్యులను వేధించేందుకే ఈ జీవో తెచ్చారని చంద్రబాబు ఆరోపించారు. ఏపీ సర్కారు ఈ జీవోను వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
Go Back to Shorts
PCI
Jagan
Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News