Hayatnagar: హయత్‌నగర్ కేసు: కీర్తికి అబార్షన్ చేసిన పద్మ నర్సింగ్‌హోం సీజ్!

  • కీర్తిపై బాల్‌రెడ్డి అత్యాచారం
  • ఆమనగల్ తీసుకెళ్లి అబార్షన్ చేయించిన శశికుమార్
  • డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో దాడిచేసిన అధికారులు
సంచలనం సృష్టించిన హయత్‌నగర్ కీర్తి కేసులో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అలెర్టయ్యారు. కీర్తికి అబార్షన్ చేసిన మహబూబ్‌నగర్ జిల్లా, ఆమనగల్‌లోని పద్మ నర్సింగ్‌హోంను సీజ్ చేశారు. డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిన్న ఆసుపత్రిపై దాడిచేసిన వైద్యాధికారులు ఆసుపత్రిని సీజ్ చేశారు.

కీర్తిపై బాల్‌రెడ్డి అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చింది. దీంతో అబార్షన్ కోసం శశికుమార్‌ను సాయం కోరింది. అతడు కీర్తిని కారులో ఆమనగల్ తీసుకెళ్లి కీర్తికి అబార్షన్ చేయించాడు. విచారణలో ఆమె ఈ విషయాలు స్వయంగా వెల్లడించడంతో ఆమెకు అబార్షన్ చేసిన ఆసుపత్రిని అధికారులు తాజాగా సీజ్ చేశారు.
Hayatnagar
keerthi
amangal
abortion
balreddy

More Telugu News