DK Shivakumar: ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్

  • మనీలాండరింగ్ కేసులో అరెస్ట్
  • గత నెల 23న బెయిలుపై విడుదల
  • బెంగళూరులోని అపోలో ఆసుపత్రిలో చేరిక
అధిక రక్తపోటుతోపాటు రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడంతో కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ఆసుపత్రిలో చేరారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన శివకుమార్ కు బెయిలు లభించడంతో గత నెల 23న తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. తాజాగా, అనారోగ్యానికి గురి కావడంతో వైద్యుల సూచన మేరకు ఆయన బెంగళూరులోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.
DK Shivakumar
Congress
Karnataka
appolo hospital

More Telugu News