ఇంతకంటే దౌర్భాగ్యం లేదు.. నారా లోకేశ్ ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదు: మంత్రి మోపిదేవి
- ఇసుక మాఫియాను ప్రోత్సహించింది నారా లోకేశే
- ఇసుక మాఫియా నుంచి ప్రతి రోజు కోట్లాది రూపాయల ముడుపులు తీసుకున్నారు
- చంద్రబాబు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు
వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి ఏం చేయాలో అర్థంకాక... ఇసుక అంశంపై నానా యాగీ చేస్తున్నారని మోపిదేవి మండిపడ్డారు. రాజకీయాలను పక్కన పెట్టి ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తే మంచిదని అన్నారు. విపక్షాలు ఇచ్చే సలహాలను స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఇప్పటికే ఆదేశాలను ఇవ్వడం జరిగిందని తెలిపారు.