బెంగళూరు చిన్నస్వామి స్టేడియంను పరిశీలించిన గంగూలీ.. సబ్ ఎయిర్ సిస్టమ్ పై ప్రశంసలు

  • గంగూలీతో పాటు స్టేడియంను పరిశీలించిన జై షా, అరుణ్ సింగ్ ధుమాల్
  • రాహుల్ ద్రవిడ్ తో భేటీ అయిన గంగూలీ
  • స్డేడియంలో ఏర్పాట్లపై ప్రశంసలు
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంను నిన్న భారత క్రికెట్ దిగ్గజం, బీసీసీఐ నూతన అధ్యక్షుడు గంగూలీ సందర్శించారు. ఈ సందర్భంగా స్టేడియంలోని వివిధ విభాగాలను, ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మైదానంలో ఏర్పాటు చేసిన సబ్ ఎయిర్ సిస్టమ్ ను పరిశీలించిన ఆయన... కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పై ప్రశంసలు గుప్పించారు. ఇదే సమయంలో నేషనల్ క్రికెట్ అకాడెమీ ఛైర్మన్ రాహుల్ ద్రావిడ్ తో గంగూలీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి జై షా, ట్రెజరర్ అరున్ సింగ్ ధుమాల్ కూడా పాల్గొన్నారు.

ఈ సమావేశం సందర్భంగా గంగూలీతో పాటు బీసీసీఐ ఆఫీస్ బేరర్స్ కు సబ్ ఎయిర్ సిస్టమ్ గురించి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ వివరించింది. వర్షం వల్ల మైదానంలో నిలిచిపోయే నీటిని వెంటనే బయటకు పంపేందుకు ఈ సబ్ ఎయిర్ సిస్టమ్ సహకరిస్తుంది.
Go Back to Shorts
Ganguly
BCCI
Dravid
Chinna Swamy Stadium

More Telugu News