ఇక సినిమాగా లాలుప్రసాద్ జీవిత చరిత్ర.. ఫిబ్రవరిలో విడుదల

  • లాలుప్రసాద్‌గా భోజ్‌పురి నటుడు యశ్‌కుమార్
  • రబ్రీదేవిగా స్మృతి సిన్హా
  • ఆర్జేడీ గుర్తు పేరుతోనే సినిమా
ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలుప్రసాద్ యాదవ్ జీవితగాథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఆర్జేడీ ఎన్నికల గుర్తు అయిన లాల్‌టెన్ (లాంతర్) పేరుతో రాబోతున్న ఈ సినిమాలో భోజ్‌పురి చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు యశ్‌కుమార్.. లాలుప్రసాద్ పాత్ర పోషించనున్నారు. ఆయన భార్య రబ్రీదేవిగా స్మృతి సిన్హా నటించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమా విడుదల కానుంది.

ప్రస్తుతం పలు భాషల చిత్ర పరిశ్రమల్లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. పోటాపోటీగా ఇటువంటి సినిమాలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీపై ‘పీఎం నరేంద్రమోదీ’, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’, బాల్‌థాకరేపై ‘ఠాక్రే’ వంటి సినిమాలు వచ్చాయి.  
Go Back to Shorts
Bihar
Lalu prasad yadav
bio pic
RJD

More Telugu News