Nara Lokesh: ఈ అభాగ్యురాలు చేసిన పాపమేంటి?: నారా లోకేశ్

  • ఎన్నికల ముందు అమ్మా.. అక్కా.. చెల్లీ అంటూ ఓట్లడిగారు
  • ఇప్పుడు వారి భద్రత గురించి పట్టించుకోవట్లేదు
  • వైసీపీ నాయకుడొకరు మహిళపై అత్యాచారం చేయబోయాడు
ఎన్నికల ముందు అమ్మా.. అక్కా.. చెల్లీ అంటూ ఓట్లు అడిగిన ఏపీ సీఎం జగన్.. ఇప్పుడు వారి భద్రత గురించి పట్టించుకోవట్లేదని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. 'అనంతపురం జిల్లా ఈదుల బలపురంలో ఒక మహిళ భర్తను బంధించి, మీ నాయకుడొకరు ఆమెపై అత్యాచారం చేయబోయిన ఘటన అత్యంత ఘోరం. ఈ అభాగ్యురాలు చేసిన పాపమేంటి? ఎన్నికలప్పుడు అమ్మా, అక్కా, చెల్లీ అని ఓట్లు అడిగారు కదా జగన్ గారూ. ఇప్పుడు వాళ్లకి భద్రత కరవయింది, దీనికేం సమాధానం చెబుతారు?' అని ట్వీట్ చేశారు. ఆ మహిళ మీడియాకు వివరాలు తెలిపిన వీడియోను పోస్ట్ చేశారు.

కాగా, సోమందేపల్లి మండలం ఈదుల బలపురం గ్రామంలో వైసీపీ నాయకుడు ఒకరు తనను వేధిస్తున్నాడని ఓ వివాహిత ఆరోపణలు చేసింది. తన కోరిక తీర్చాలంటూ తనను  ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తెలిపింది. తన భర్తను బంధించి తనపై అత్యాచారం చేయబోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు వైసీపీ నేతను  అరెస్ట్ చేసి, శిక్షించాలని పేర్కొంది.
Nara Lokesh
YSRCP
Telugudesam

More Telugu News