Chandrababu: మనోవేదనతో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం మనసును కలచివేస్తోంది: చంద్రబాబు

  • ఐదు నెలలుగా వారికి పనులు లేవు
  • కుటుంబాలు పస్తులు ఉండడం చూడలేక పోతున్నారు
  • వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
  • ఓ కార్మికుడి సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. 'ఐదు నెలలుగా పనులు లేక, కుటుంబాలు పస్తులు ఉండడం చూడలేక మనో వేదనతో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం మనసును కలచివేస్తోంది. సెల్ఫీ వీడియోల్లో.. ఆత్మహత్యలే తమకిక శరణ్యమంటూ వారు ఇలా పేర్కొనడం చూసైనా ఈ ప్రభుత్వం మేల్కొనాలి. పనులు కోల్పోయిన కార్మికులకు పరిహారం చెల్లించాలి' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

తన కుటుంబాన్ని పోషించలేకపోతున్నానంటూ ఒకరు కన్నీళ్లు పెట్టుకుంటూ తీసుకున్న సెల్ఫీ వీడియోను చంద్రబాబు పోస్ట్ చేశారు. తన పరిస్థితులు బాగోలేవని, పని దొరకడం లేదని అందులో ఓ వ్యక్తి పేర్కొన్నాడు. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని, తనను క్షమించాలని ఆ వీడియోలో అతడు తన కుటుంబ సభ్యులను కోరాడు. 
Chandrababu
Twitter
Andhra Pradesh

More Telugu News