Udayanidhi: భయపెడుతున్న 'సైకో' టీజర్

  • అంధుడిగా ఉదయనిధి స్టాలిన్ 
  •  క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ 
  • ముఖ్య పాత్రల్లో నిత్య .. అదితీరావ్   
తమిళంలో మిస్కిన్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా 'సైకో' రూపొందుతోంది. ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాలో అంధుడిగా నటిస్తుండటం విశేషం. ముఖ్యమైన పాత్రల్లో నిత్యామీనన్ .. అదితీరావ్ హైదరి కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు.

ఓ పాడుబడిన గదిలో రక్తం మరకలతో కూడిన బ్యాగ్ .. చీకటిలో ఒక కారుని ఫాలో అవుతుండటం .. నిత్యామీనన్ భయాందోళనలకి లోనుకావడం .. రహస్యంగా అదితీరావ్ ఏదో విషయాన్ని గమనిస్తూ ఉండటం .. అపార్టుమెంట్ కారు పార్కింగ్ ప్లేస్ లో మర్డర్ జరిగిన ఆనవాళ్లు .. అంధుడైన ఉదయనిధి రాత్రివేళలో ఎక్కడికో బయల్దేరడం వంటి బిట్స్ తో వదిలిన ఈ టీజర్ హారర్ నేపథ్యంలో వుంది. ఇళయరాజా నేపథ్య సంగీతం ఈ క్రైమ్ థ్రిల్లర్ కి హైలైట్ గా నిలవనుందనే విషయం ఈ టీజర్ ను బట్టే అర్థమైపోతోంది.
Udayanidhi
Nithya
Adithi

More Telugu News