Kalyan Ram: కేరళకి 'ఎంతమంచివాడవురా' .. సంక్రాంతికి రావడం ఖాయమే

  • సతీశ్ వేగేశ్న నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథాకథనాలు 
  • జనవరి 15వ తేదీన విడుదల
కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా సతీశ్ వేగేశ్నకి మంచి పేరు వుంది. 'శతమానం భవతి' .. 'శ్రీనివాస కల్యాణం' వంటి కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించిన ఆయన, తాజాగా 'ఎంతమంచివాడవురా' సినిమాను రూపొందిస్తున్నాడు. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమవుతోంది.

ఈ సినిమా చివరి షెడ్యూల్ ను కేరళలో ప్లాన్ చేశారు. అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతోపాటు, ఒకటి రెండు పాటలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. మెహ్రీన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 15వ తేదీన విడుదల చేయనున్నారు. గోపీసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
Kalyan Ram
Mehreen

More Telugu News