Nara Lokesh: డబ్బు దాచుకోవడానికి ఇల్లు సరిపోక వైసీపీ నాయకులు విదేశాలకు వెళ్లి వస్తున్నారు: నారా లోకేశ్

  • ఇసుక దోపిడీ ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు
  • ఇసుక నుండి తైలం తీయగల సమర్థులు 
  • ఇసుక ధరని రెండింతలు పెంచారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇసుక అక్రమ మార్గంలో ఇతర రాష్ట్రాలకు తరలి పోతోందని అన్నారు. 'ఇసుక కొనడానికి ప్రజల ఇల్లు గుల్ల అవుతుంటే, ఇసుక దోపిడీ ద్వారా వచ్చిన డబ్బు దాచుకోవడానికి ఇల్లు సరిపోక వైసీపీ నాయకులు విదేశాలు వెళ్లి వస్తున్నారు' అని ట్వీట్ చేశారు.
 
'వైఎస్ జగన్ అండ్ కో ఇసుక నుండి తైలం తీయగల సమర్థులు అని మరోసారి నిరూపించుకున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఇసుక ధరని రెండింతలు పెంచి ప్రజల నెత్తిపై గుదిబండ వేశారు. ఆంధ్రప్రదేశ్ లో సామాన్య ప్రజలకు దొరకని ఇసుక అక్రమ మార్గంలో ఇతర రాష్ట్రాలకు తరలి పోతుంది' అని లోకేశ్ ఆరోపణలు చేశారు.  
Nara Lokesh
Telangana
YSRCP

More Telugu News