మల్కాజిగిరి కుర్రోడు.. స్వీడన్ అమ్మాయి.. వైభవంగా పెళ్లి!
- సహోద్యోగిని ప్రేమించిన అజయ్
- భారతీయ సంప్రదాయంలో ఘనంగా వివాహం
- మూడుముళ్లు వేయించుకున్న విదేశీ వధువు
విషయం తెలిసిన అజయ్ తల్లిదండ్రులు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెట్రాతో కలిసి అజయ్ నగరానికి చేరుకున్నాడు. నిన్న తార్నాక రైల్వే ఆఫీసర్స్ క్లబ్లో భారతీయ సంప్రదాయంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. సిగ్గులమొగ్గలైన పెట్రా మెడలో అజయ్ మూడుముళ్లు వేశాడు. ఈ వివాహానికి అజయ్ బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరై వధూవరులను ఆశీర్వదించారు.