Chandrababu: జగన్ ఢిల్లీ పర్యటన వివరాలను వెల్లడించాలి: సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్

  • బాబు పాలనలో ఏపీకి మోదీ ప్రభుత్వం అన్యాయం  
  • వైసీపీ హయాంలోనూ అదే సీన్ రిపీట్!
  • ఢిల్లీలో ఎంపీకి దక్కిన విలువ సీఎం జగన్ కు దక్కలేదా?
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వివరాలను వెల్లడించేందుకు ఎందుకు జంకుతున్నారని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం అఖిలపక్ష భేటీ నిర్వహించి ఢిల్లీ పర్యటన వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.

 సీఎం రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని చెప్పుకుంటునప్పుడు.. ఏయే సమస్యలకు కేంద్రం వద్ద పరిష్కారం దొరికిందో చెప్పాలన్నారు. ఢిల్లీలో ఎంపీకి దక్కిన విలువ ముఖ్యమంత్రి జగన్ కు దక్కలేదా? అని రామకృష్ణ ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని.. తాజాగా మళ్లీ వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా అదే జరుగుతోందన్నారు. రైతులను కులాల వారీగా విభజించి, వారికి రైతు భరోసా అందకుండా చేశారని విమర్శించారు.
Chandrababu
Jagan
Ramakrishna
Narendra Modi

More Telugu News