Katchuluru: ధర్మాడి సత్యం బృందాన్ని సత్కరించి.. అభినందించిన జిల్లా కలెక్టర్

  • మునిగిన బోటును నిన్న వెలికితీసిన ధర్మాడి బృందం
  • కలెక్టర్ మురళీధర్ రెడ్డిని కలిసిన సత్యం ట్రూప్
  • రూ.20 లక్షల చెక్కు అందజేసిన కలెక్టర్
కచ్చులూరు వద్ద గోదావరిలో ఇటీవల మునిగిపోయిన బోటును ధర్మాడి సత్యం బృందం నిన్న వెలికితీసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డిని సత్యం బృందం ఈరోజు కలిసింది. ఈ సందర్భంగా ధర్మాడి సత్యం సహా ఆయన బృందాన్ని దుశ్శాలువాలతో సత్కరించి, అభినందించారు. బోటు వెలికితీసినందుకు గాను ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల చెక్కును ఆయనకు అందజేశారు.

కాగా, తూర్పుగోదావరి జిల్లా  కాకినాడలో బాలాజీ మెరైన్ సంస్థ అధినేత ధర్మాడి సత్యం. గతంలో ఆయన పలు రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించారు. కాకినాడ సమీపంలో ఓ నిరుపేద కుటుంబంలో ధర్మాడి సత్యం జన్మించారు. పెద్దగా ఆయన చదువుకోలేదు. అయితే, పడవలు, బోట్ల విషయంలో ఆయనకు మంచి పరిజ్ఞానం ఉంది.
Katchuluru
Godavari
Boat
Dharmadi
Satyam

More Telugu News