Pakistan: మోదీపై దాడి చేస్తానంటూ పాక్ గాయకురాలు వ్యాఖ్యలు.. సూసైడ్ జాకెట్‌ ధరించి ఫొటో పోస్ట్!

షార్ట్స్‌లో చూడండి
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హిట్లర్‌గా అభివర్ణిస్తూ, ఆయనపై ఆత్మాహుతి దాడి చేస్తానంటూ పాకిస్థాన్‌ సింగర్‌ రబీ పిర్జాదా మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాను సూసైడ్ జాకెట్‌ ధరించిన ఫొటోను ఆమె తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఈ విధంగా పేర్కొంది. గతంలోనూ ఆమె ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన పోస్ట్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

పాక్ ఉగ్రవాదాన్ని పోత్సహిస్తుందనడానికి రబీ పిర్జాదా తీరే నిదర్శనమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇలా సూసైడ్  జాకెట్‌ ధరించడం పాకిస్థాన్‌ సంప్రదాయ వస్త్రధారణలో భాగమంటూ సెటైర్లు వేస్తున్నారు. గతంలో ఆమె తన పెంపుడు పాములు, మొసళ్లకు మోదీని విందుగా చేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నాలుగు అనకొండలను, ఒక మొసలిని మోదీకి బహుమతిగా పంపిస్తానని పేర్కొంది. ఆమె పీవోకేకు చెందిన ఓ ఆర్మీ అధికారి కూతురు.
Go Back to Shorts
Pakistan
India
Twitter
Narendra Modi

More Telugu News