ఘరానా మోసగాడు శ్రీనివాసరావు అరెస్ట్... 12 జిల్లాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్!
- 150 మంది నుంచి పెద్దమొత్తంలో వసూలు చేసినట్టు ఆరోపణలు
- ఎంటెక్ చదివిన శ్రీనివాసరావు
- డబ్బు కోసం అడ్డదారులు
శ్రీనివాసరావు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా తొండంగి. ఎంటెక్ చదివాడు. సులువుగా డబ్బు సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కాడు. అతడిపై ఇప్పటివరకు 20 కేసులున్నాయి. సాధారణ పోలీసులతో పాటు సీఐడీ, సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కొంతకాలంగా శ్రీనివాసరావు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 600 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను జల్లెడ పట్టి పక్కా స్కెచ్ తో అతడిని పట్టుకున్నారు.