'రామాయణం' తరువాత అందుకే నటించలేదు: స్మితా మాధవ్
తాజా ఇంటర్వ్యూలో ఆమె ఆ విషయాలను గురించి మాట్లాడుతూ .. 'రామాయణం' సినిమాలో సీతాదేవిగా నేను చేయాలనే నిర్ణయం మా అమ్మానాన్నలదే. ఆ సినిమా తరువాత చాలా అవకాశాలు వచ్చాయి. అలా వచ్చిన అవకాశాల్లో మంచి ప్రాజెక్టులు వున్నాయి. అయితే చదువు దెబ్బతింటుందనే ఉద్దేశంతో చేయలేదు. అందుకే ఆ సమయంలో సినిమాలు చేయాలనిపించలేదు .. చేయలేదు. ఆ తరువాత నాకు సినిమాలపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు నాకు నచ్చిన పాత్రలు వస్తే గనుక తప్పకుండా చేస్తాను' అని చెప్పుకొచ్చింది.