ఆ సమయంలో గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడై ఉంటే బాగుండేది: యువరాజ్ సింగ్
- బోర్డు పగ్గాలందుకోబోతున్న గంగూలీ
- శుభాకాంక్షలు తెలిపిన యువరాజ్
- యోయో టెస్టుపై దాదా సరైన నిర్ణయం తీసుకునేవాడని వెల్లడి
ఓ గొప్ప వ్యక్తి ప్రస్థానం మరింత గొప్పగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే, కొన్నాళ్ల కిందట భారత క్రికెట్ లో యోయో టెస్టు ప్రవేశపెట్టినప్పుడు గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అయ్యుంటే ఎంతో బాగుండేదని, యోయో టెస్టుపై ఆటగాళ్ల దృక్కోణం నుంచి ఆలోచించగల వ్యక్తిగా గంగూలీ సరైన నిర్ణయం తీసుకుని ఉండేవాడని యువరాజ్ పేర్కొన్నాడు. బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా సరికొత్త పదవి చేపడుతున్న సందర్భంగా దాదాకు యువీ శుభాకాంక్షలు తెలిపాడు.