బంద్ కు మద్దతుగా నిలిచిన ‘జన సేన’ తెలంగాణ ఇంఛార్జి అరెస్ట్ !
- కూకట్ పల్లి ఆర్టీసీ డిపో దగ్గర నిరసన తెలిపిన ‘జనసేన’
- నేమురి శంకర్ గౌడ్ సహా కార్యకర్తల అరెస్టు
- బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలింపు
కూకట్ పల్లి ఆర్టీసీ డిపో దగ్గర శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తెలంగాణ జనసేన ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్, పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసి బాచుపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. తమ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని ‘జనసేన’నేతలు ఖండించారు.