ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాక చర్చలేముంటాయి?: టీ-సర్కార్ పై విమలక్క ఆగ్రహం
- ప్రభుత్వం మాట్లాడే మాటలకు అర్థం ఉండాలి
- కార్మికులతో ముందుగా చర్చలు జరపాలి
- ఆ తర్వాతే సమ్మె విరమిస్తారు
ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ, సమ్మె విరమించాక చర్చలేముంటాయి? మాట్లాడే మాటలకు అర్థం ఉండాలని ప్రభుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు. ముందుగా, చర్చలు జరిపితే, ఆ తర్వాత సమ్మె విరమిస్తారని, సమ్మె చేయడం కార్మికుల జన్మహక్కు అని అన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్లలో చాలా మంది మహిళలు ఉన్నారు, అదుపు చేసేందుకు వచ్చిన వారిలో మహిళా పోలీసులు లేకపోవడం దారుణమని విమర్శించారు.