మూడో టెస్టు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- ఒకే ఒక్క మార్పుతో బరిలోకి భారత్
- క్లీన్‌స్వీప్ చేయాలని భారత్ పట్టుదల
- మ్యాచ్ గెలిచి పరువు దక్కించుకోవాలని సఫారీల ఆరాటం
ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. పేసర్ ఇషాంత్‌శర్మకు బదులుగా స్పిన్నర్ నదీమ్‌ని తుది జట్టులోకి తీసుకున్నారు. నదీమ్‌కు ఇది అరంగేట్ర మ్యాచ్. గాయం కారణంగా సఫారీ ఓపెనర్ మార్క్రమ్, స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌లు జట్టుకు దూరం కావడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే.
భారత జట్టు: మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, షాబాజ్ నదీమ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ.
దక్షిణాఫ్రికా జట్టు: డీన్ ఎల్గర్, క్వింటన్ డీకాక్, హమ్జా, డుప్లెసిస్ (కెప్టెన్), బవుమా, క్లాసెన్ (వికెట్ కీపర్), లిండే, డేన్ పీడ్ట్, రబడ, నార్ట్జె, లుంగి ఎంగిడి.