krishna river: కరకట్టపై కూల్చివేతలు... సీఆర్‌డీఏ అధికారుల ఆధ్వర్యంలో మళ్లీ మొదలు

  • గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయిపాలెంలో ప్రారంభం
  • శివక్షేత్రం వద్ద మరుగుదొడ్లు, క్యాంటీన్ భవనాల కూల్చివేత
  • ఘటనా స్థలిలో గట్టి పోలీసు బందోబస్తు
అక్రమ కట్టడాల కూల్చివేతను సీఆర్‌డీఏ అధికారులు మళ్లీ మొదలు పెట్టారు. కృష్ణా నది తీరం వెంబడి ఉన్న పలు కట్టడాలు అక్రమ నిర్మాణాలని గతంలోనే నోటీసులు జారీ చేసిన అధికారులు వాటిని కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయిపాలెంలోని శివక్షేత్రం వద్ద మరుగుదొడ్లు, క్యాంటీన్‌ భవనాలను కార్మికులు కూలుస్తున్నారు. రెవెన్యూ, పోలీసుల సహకారంతో సీఆర్‌డీఏ అధికారులు కూల్చివేత పనులు చేపట్టారు. ఈ కారణంగా శివక్షేత్రం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
krishna river
sivaskestam
crda

More Telugu News