Telugudesam politbureau: టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం ప్రారంభం.. కీలక అంశాలపై చర్చ

  • చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న భేటీ
  • స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ ప్రధాన అజెండా
  • అధికార పార్టీ అక్రమ కేసులపైనా సీరియస్‌ చర్చ
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో కీలకమైన అంశాలపై చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో ఈరోజు మధ్యాహ్నం సమావేశమైంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమావేశంలో సంస్థాగత ఎన్నికలు, పార్టీ కమిటీల ఏర్పాటు తదితర 13 అంశాలతో ఎజెండా రూపొందించి వాటిపై చర్చించాలని నిర్ణయించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలైన పథకాల నిలిపివేత, టీడీపీ నేతలపై అక్రమ కేసుల అంశాలపైనా  పొలిట్‌ బ్యూరో సీరియస్‌ గా చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఎలా సంసిద్ధం కావాలన్న అంశంపై చర్చించి పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేసే కార్యాచరణ రూపొందించనున్నారు.
Telugudesam politbureau
Chandrababu
local pols

More Telugu News