వారు మీ లోకేశ్ లా మొద్దబ్బాయిలు కాదు: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు
- గ్రామ కార్యకర్తలుగా ఎంపికైన వారిలో ఎవరికీ ఓనమాలు రావట
- ఇవి చంద్రబాబు చేసిన కడుపు మంట మాటలు
- కమెడియన్ లా కార్యకర్తలను అహ్లాదపరచడం పైనే ఆయన దృష్టి
'ఎవరిచ్చారు మీకీ అధికారమంటూ చంద్రబాబు పదే పదే శోకాలు పెడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. ఎక్కడ మాట్లాడినా ఒక కమెడియన్ తరహాలో కార్యకర్తలను అహ్లాదపరచడం పైనే ఆయన దృష్టి పెట్టినట్టున్నారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ఇలా ప్రశ్నించరాదనే కనీస సృహ కూడా లేదు' అని ఎద్దేవా చేశారు.