చేతిలో తుపాకులతో హిందీ పాటకు డ్యాన్స్.. వీడియో వైరల్.. విచారణకు ఆదేశం

  • దర్యాప్తు ప్రారంభించిన హరిద్వార్ పోలీసులు
  • ఘటన ఎక్కడ జరిగిందన్న దానిపై స్పష్టత కరవు
  • గతంలో బీజేపీ ఎమ్మెల్యే కూడా ఇలానే
చేతిలో తుపాకులతో డ్యాన్స్ చేసిన వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. దీంతో అతడు ఎవరు? ఎప్పుడు జరిగింది? అన్న విషయాలు తెలుసుకునేందుకు ఉత్తరాఖండ్ పోలీసులు రంగంలోకి దిగారు. రెండు చేతులతో తుపాకులు పట్టుకుని హిందీ పాటకు డ్యాన్స్ చేస్తూ ఆ వ్యక్తి కనిపించాడు. ఓ ఇంట్లో ఈ వీడియోను చిత్రీకరించినట్టు వీడియోను బట్టి అర్థమవుతోంది.

ఆ వీడియోలో ఉన్నది ఎవరో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నట్టు  హరిద్వార్‌ సర్కిల్‌ అధికారి అభయ్‌ సింగ్‌ తెలిపారు. త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకుంటామన్నారు. ఈ ఘటన హరిద్వార్‌లోనే జరిగిందా? లేక, మరెక్కడైనానా? అన్న విషయం దర్యాప్తులో తెలుస్తుందన్నారు. కాగా, ఈ ఏడాది జూలైలో బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ కూడా ఇలానే డ్యాన్స్ చేసి పార్టీ నుంచి సస్పెండయ్యారు. పోలీసులు అతడి గన్ లైసెన్స్‌ను రద్దు చేశారు.  

Uttarakhand
Haridwar
dance
guns

More Telugu News