ayodya issue: అయోధ్యపై ఈ రోజుతో వాదనలు ముగుస్తాయి: సుప్రీం చీఫ్‌ జస్టిస్‌

  • కేసు విచారిస్తున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం
  • ప్రధాన న్యాయమూర్తి గొగోయ్‌ నేతృత్వం 
  • నవంబరు 17లోగా తీర్పు వెలువడే అవకాశం

అయోధ్యలోని రామ మందిరం నిర్మాణం, బాబ్రీ మసీదు కేసులో నెలకొన్న వివాదం నేపథ్యంలో గడచిన 39 రోజులుగా కొనసాగుతున్న వాదనలకు ఈ రోజుతో స్వస్తి పలకనున్నట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ స్పష్టం చేశారు. బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన అన్ని వర్గాల వాదనలు ఈ రోజు సాయంత్రం ఐదు గంటలతో ముగించనున్నామని తెలిపారు. అయోధ్య వివాదంపై గొగోయ్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.

నెలరోజులుగా పలు వర్గాల వాద, ప్రతివాదనలను ధర్మాసనం రికార్డు చేస్తోంది. నవంబరు 17వ తేదీన చీఫ్‌ జస్టిస్‌ పదవీ విరమణ చేస్తున్నారు. ఈ కేసుకు వీలైనంత వేగంగా ముగింపు పలకాలని ఎపెక్స్‌ కోర్టు భావిస్తున్నందున ఆయన పదవీ విరమణ చేసేలోగా తీర్పు వెలువరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

More Telugu News