cabinet meet: ఏపీ కేబినెట్‌ కీలక భేటీ నేడు: ఎజెండాలో పలు అంశాలు

  • ఉదయం 10 గంటల తర్వాత సమావేశం
  • చేనేత కార్మిక కుటుంబాలకు సాయంపై ప్రధానంగా చర్చ
  • పలు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం
ఏపీలోని వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వ కేబినెట్‌ సమావేశం మరికాసేపటిలో జరగనుంది. ఈరోజు ఉదయం 10.30 గంటల తర్వాత భేటీ జరగనుంది. పదిహేను కీలక అంశాలు ఎజెండాలో ఉండడంతో సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కార్పొరేషన్లు, బోర్డు ఏర్పాటు, స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ వంటి అంశాలతోపాటు చేనేత కార్మికులకు ఆర్థిక సాయం అందించడంపై ప్రధానంగా చర్చ జరగనున్నది.

మత్స్యకారుల సంక్షేమం, డ్వాక్రా మహిళ కోసం వైఎస్సార్‌ క్రాంతి పథకం, ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు, వివిధ వర్గాలకు వాహనాల పంపిణీ వంటి అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే వివాదాస్పదంగా ఉన్న పోలవరం, రాజధాని నిర్మాణం, పీపీఏలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.
cabinet meet
amaravathi
YSRCP
Jagan

More Telugu News