ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు.. కశ్మీర్‌లో కొనసాగుతున్న భీకర ఎన్‌కౌంటర్
- ఉదయం నుంచి కొనసాగుతున్న ఎన్‌కౌంటర్
- ఇంట్లో నక్కింది ముగ్గురు ఉగ్రవాదులుగా అనుమానం
- ఇంటిని చుట్టుముట్టిన భద్రతా దళాలు
దీంతో ఉగ్రవాదులు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ఇంటిని చుట్టుముట్టిన భద్రతా దళాలు కాల్పులు ప్రారంభించాయి. లోపల ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించిన అధికారులు.. ముందు జాగ్రత్త చర్యగా మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కాగా, వారం రోజులుగా గాలిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులు మంగళవారం గాందర్బల్ అడవుల్లో పోలీసులకు పట్టుబడ్డారు.