Jammu And Kashmir: ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు.. కశ్మీర్‌లో కొనసాగుతున్న భీకర ఎన్‌కౌంటర్

  • ఉదయం నుంచి కొనసాగుతున్న ఎన్‌కౌంటర్
  • ఇంట్లో నక్కింది ముగ్గురు ఉగ్రవాదులుగా అనుమానం
  • ఇంటిని చుట్టుముట్టిన భద్రతా దళాలు
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా, బిజ్‌మెహరా ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఈ ఉదయం భద్రతా దళాలు తనిఖీలు ప్రారంభించగా, ఎదురుపడిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి.

దీంతో ఉగ్రవాదులు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ఇంటిని చుట్టుముట్టిన భద్రతా దళాలు కాల్పులు ప్రారంభించాయి. లోపల ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించిన అధికారులు.. ముందు జాగ్రత్త చర్యగా మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కాగా, వారం రోజులుగా గాలిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులు మంగళవారం గాందర్బల్ అడవుల్లో పోలీసులకు పట్టుబడ్డారు.
Jammu And Kashmir
terrorists
encounter

More Telugu News