చిదంబరంను విచారించేందుకు ఈడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్
- ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచారణ
- చిదంబరంను విచారించేందుకు అనుమతించాలన్న ఈడీ
- అవసరమైతే అరెస్ట్ చేయండన్న న్యాయస్థానం
బుధవారం నాడు తీహార్ జైల్లో చిదంబరంను ప్రశ్నించవచ్చని, అవసరం అనుకుంటే ఆయనను అరెస్ట్ చేయవచ్చని స్పష్టం చేసింది. అయితే, చిదంబరం రిమాండ్ కోరుతూ ఈడీ దాఖలు చేసిన దరఖాస్తుపై స్పందిస్తూ, చిదంబరంను రిమాండ్ లోకి తీసుకోవడం అనేది ఈ దశలో తొందరపాటు చర్య అవుతుందని, చిదంబరం స్థాయిని దృష్టిలో పెట్టుకుని చూస్తే అది సహేతుకం కాదని పేర్కొంది.