ప్రధాని ఎప్పుడూ ట్రంప్, అంబానీలతోనే కనిపిస్తారు, పేదరైతులతో ఎప్పుడైనా కనిపించారా?: రాహుల్ విమర్శలు
- హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల సమరం
- ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ
- ప్రధాని మోదీపై ధ్వజం
వ్యాపారవేత్తల ప్రయోజనాలే ప్రధానికి ముఖ్యమని, రైతుల పక్షాన ఎప్పుడూ నిలవలేదని అన్నారు. పేదల సొమ్మును వ్యాపారవేత్తలకు పంచిపెడుతున్నారని రాహుల్ మండిపడ్డారు. బీజేపీకి తోడు ఆరెస్సెస్ కూడా విజృంభిస్తోందని, ఈ రెండూ కలిసి దేశాన్ని కులాలు, ప్రాంతాల వారీగా విడగొట్టి విభేదాలకు కారణమవుతున్నాయని ఆరోపించారు.