సీఎం వైఎస్ జగన్ ను కలిసిన చిరంజీవి దంపతులు
ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రముఖ సినీ నటుడు చిరంజీవి దంపతులు కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి చిరంజీవి, ఆయన భార్య సురేఖ ఈరోజు వెళ్లారు. జగన్ కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి చిరంజీవి సత్కరించారు. మర్యాదపూర్వకంగా తనను కలిసిన చిరంజీవి దంపతులను జగన్ సాదరంగా ఆహ్వానించారు.