జగన్ తో లంచ్ మీటింగ్ కోసం విజయవాడ చేరుకున్న చిరంజీవి!
- నేడు జగన్ తో చిరంజీవి భేటీ
- మధ్యాహ్న భోజనం కలిసే..
- భేటీ మర్యాద పూర్వకమేనన్న ఇరు వర్గాలు
కాగా, జగన్ ముఖ్యమంత్రి కావడం టాలీవుడ్ నటీ నటులకు ఇష్టం లేదని, అందుకే ఆయన్ను ఎవరూ కలవలేదని ఇటీవలి కాలంలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కొందరు ప్రముఖులకు జగన్ అంటే ఇష్టం లేదని నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి లంచ్ మీటింగ్ ఆసక్తికరంగా మారింది. ఇక జగన్ ను కలిసే నిమిత్తం చిరంజీవి ఇప్పటికే విజయవాడకు చేరుకోగా, ఆయనకు ఫ్యాన్స్ తో పాటు జనసేన కార్యకర్తల నుంచి స్వాగతం లభించింది.