Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎస్వీబీసీ డైరెక్టరు పదవి దక్కింది నాకు కాదు... 'ఢమరుకం' దర్శకుడు శ్రీనివాసరెడ్డికి: కమెడియన్ శ్రీనివాసరెడ్డి వివరణ

  • ఎస్వీబీసీ డైరెక్టర్లుగా స్వప్న, శ్రీనివాసరెడ్డి నియామకం!
  • కమెడియన్ శ్రీనివాసరెడ్డిగా పొరబడిన మీడియా
  • అసలు విషయం చెప్పిన కమెడియన్ శ్రీనివాసరెడ్డి
టీటీడీ ధార్మిక కార్యక్రమాల ప్రసారాల కోసం ఉద్దేశించిన శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ)లో కొత్తగా రెండు డైరెక్టరు పోస్టులు భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ పాత్రికేయురాలు స్వప్న, సినీ ప్రముఖుడు శ్రీనివాసరెడ్డిలను ఎస్వీబీసీ డైరెక్టర్లుగా ప్రభుత్వం నియమించిందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. శ్రీనివాసరెడ్డి అనగానే చాలామంది కమెడియన్ శ్రీనివాసరెడ్డిగా భావించారు. అతడిని శుభాకాంక్షల వెల్లువలో ముంచెత్తారు. అయితే, ఎస్వీబీసీ డైరెక్టరు పదవి దక్కింది కమెడియన్ శ్రీనివాసరెడ్డికి కాదట. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించారు.

శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ డైరెక్టరు పదవి దక్కింది తనకు కాదని, ఆ పదవి దక్కింది 'ఢమరుకం' చిత్ర దర్శకుడు శ్రీనివాసరెడ్డికి అని కమెడియన్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇద్దరి పేర్లు ఒకేలా ఉండడంతో చాలామంది పొరబడ్డారు. ఆఖరికి మీడియాలోనూ కమెడియన్ శ్రీనివాసరెడ్డికే పదవి వచ్చిందని కథనాలు వచ్చాయి.
SVBC
Srinivasareddy
Tollywood

More Telugu News