Balineni: కేంద్ర విద్యుత్ మంత్రికి లేఖ రాసిన ఏపీ మంత్రి బాలినేని

షార్ట్స్‌లో చూడండి
ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ కు లేఖ రాశారు. సౌర, పవన విద్యుత్ ఒప్పందాల వల్ల రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లుతోందని, విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి ఇవి మరింత భారంగా మారాయని లేఖలో పేర్కొన్నారు. ఈ ఒప్పందాల వల్ల ప్రతి ఏటా రూ.5000 కోట్ల మేర భారం పడుతుందని తెలిపారు.

పీపీఏల వల్ల డిస్కంలు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నాయని బాలినేని వివరించారు. డిస్కంల ఆర్థిక భారాన్ని ప్రజలపై మోపడం భావ్యం కాదని భావిస్తున్నామని, ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు మార్గాలు అన్వేషిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రం కూడా సహకరించాలని, సంక్షోభ పరిష్కారానికి కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అధ్యక్షతన కమిటీ వేయాలని విజ్ఞప్తి చేశారు. సౌర, పవన విద్యుత్ వినియోగంపై ప్రోత్సహించేందుకు కేంద్రం రాయితీలు ఇవ్వాలని బాలినేని తన లేఖలో కోరారు.
Go Back to Shorts
Balineni
Andhra Pradesh

More Telugu News