ఈ నెల 19న తెలంగాణ బంద్

  • ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతం
  • పట్టువీడని కార్మికులు
  • భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన జేఏసీ
తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె తీవ్రరూపు దాల్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో పాటు ఇతర డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు పట్టు వీడేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మెను మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై వంటావార్పు, 14న బహిరంగ సభలు, 15న రాస్తారోకోలు, 16న ర్యాలీలు, 17న ధూంధాం, 18న బైక్ ర్యాలీలు చేపట్టాలని నిశ్చయించారు. అంతేకాకుండా, ఈ నెల 19న తెలంగాణ బంద్ కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది.

Telangana
TSRTC
Strike

More Telugu News