Lalitha Jewellary: లలితా జ్యుయెలరీ చోరీ కేసు... కేటుగాడు మురుగన్ లొంగుబాటు!

  • సంచలనం సృష్టించిన లలితా జ్యుయెలరీ కేసు
  • బెంగళూరు పోలీసులకు లొంగిపోయిన ప్రధాన నిందితుడు మురుగన్
  • మురుగన్ పై 100కి పైగా కేసులు
తిరుచ్చి లలితా జ్యుయెలరీ చోరీ కేసు దక్షిణాది రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. చోరీకి సూత్రధారి ఓ సినీ నిర్మాత అని తెలియడంతో ఆశ్చర్యపోయిన జనాలు, అతడిపై 100కి పైగా కేసులున్నాయని తెలిసి నివ్వెరపోయారు. దాదాపు దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో అతడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతడి పేరు మురుగన్. తెలుగులో కొన్ని సినిమాలు కూడా తీసిన ఈ కేటుగాడు మరింత డబ్బు కోసం లలితా జ్యుయెలరీ షాపుకు కన్నంవేశాడు.

ఆరోగ్యం బాగాలేని స్థితిలో సరిగా నడవలేకపోతున్న మురుగన్ పక్కాగా చోరీ స్కెచ్ వేయగా, అతని మేనల్లుడు సురేశ్ పకడ్బందీగా అమలు చేశాడు. అయితే సురేశ్ కోర్టులో లొంగిపోవడంతో చేసేదిలేక ప్రధాన నిందితుడు మురుగన్ కూడా లొంగుబాట పట్టాడు. మురుగన్ బెంగళూరు కోర్టులో లొంగిపోయాడు. మురుగన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
Lalitha Jewellary
Chennai
Murugan
Banglore

More Telugu News