Tollywood: సినిమా ఇండస్ట్రీ అంటే బాలకృష్ణ ఒక్కడేనా?: మంత్రి బొత్స

  • నాకు తెలియక అడుగుతున్నా..
  • సీఎం జగన్ ని సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కలవడమంటే?
  • బాలకృష్ణ వచ్చి జగన్ ని కలవాలా?
సినీ అసోసియేషన్లకు చెందిన ప్రముఖులు వాళ్లకు అవసరమైతే సీఎం జగన్ ని కలుస్తారు, లేకపోతే లేదు, అది వాళ్ల ఇష్టం అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఎవరూ సీఎం జగన్ ని ఇంత వరకూ కలవలేదన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, నాగార్జున, మోహన్ బాబు వచ్చి ఇటీవలే జగన్ ని కలిసిన విషయాన్ని గుర్తుచేశారు.

‘నాకు తెలియక అడుగుతున్నా..’ సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు కలవడమంటే బాలకృష్ణ వచ్చి జగన్ ని కలవాలా? సినిమా ఇండస్ట్రీ అంటే బాలకృష్ణ ఒక్కడేనా? అని ప్రశ్నించారు. ఇక ఇటీవల విడుదలైన చిరంజీవి చిత్రం ‘సైరా’ గురించి ఆయన ప్రస్తావించారు. ఈ చిత్రం సక్సెస్ అయిందని అన్నారు. సీఎంని కలుస్తానని చిరంజీవి కోరారు, ఆయన్ని రమ్మనమని జగన్ చెప్పారని.. ఇది సంతోషకరమైన విషయమని అన్నారు.
Tollywood
Botsa Satyanarayana
Balakrishna
Chiranjeevi
jagan

More Telugu News