Syeraa: భారత ఆర్మీ, వాయుసేన కోసం సైరా ప్రత్యేక ప్రదర్శనలు

  • అక్టోబరు 2న విడుదలైన సైరా
  • బాక్సాఫీసు వద్ద విజయవంతం
  • బెంగళూరులో సైన్యం కోసం 60 ప్రదర్శనలు
తెలుగు సినీ ఖ్యాతిని మరింత పెంచిన చిత్రంగా సైరా అభినందనలు అందుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చారిత్రక చిత్రం అక్టోబరు 2న విడుదలై విజయవంతంగా నడుస్తోంది. వ్యాపారం కోసం భారతగడ్డపై అడుగుపెట్టిన బ్రిటీషర్లు ఆపై భారతీయులను బానిసత్వంలోకి నెట్టగా, నాటి తెల్లదొరలను ఎదిరించిన తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే ఆయన గురించి చరిత్రలో ఎక్కువగా పేర్కొనకపోవడంతో, చిరంజీవి ఎంతో శ్రద్ధ తీసుకుని సైరా చిత్రం ద్వారా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడీ చిత్రాన్ని భారత సైన్యం కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. కర్ణాటకలో ధీరజ్ ఎంటర్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ బెంగళూరులో ఆర్మీ, వాయుసేన సిబ్బంది కోసం దాదాపు 60 ప్రదర్శనలు కేటాయించింది. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం విపరీతంగా ప్రచారం అవుతోంది.
Syeraa
Chiranjeevi
Tollywood
Ramcharan
Army
IAF
Banglore

More Telugu News