Rajani: రజనీ 168వ సినిమాకి శివ దర్శకత్వం

  • రజనీ తాజా చిత్రంగా 'దర్బార్' 
  • దీపావళికి ప్రేక్షకుల ముందుకు
  • త్వరలో శివతో కలిసి సెట్స్ పైకి
కొంతకాలంగా రజనీకాంత్ 'దర్బార్' సినిమాతో బిజీగా వున్నారు. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 'దర్బార్' సినిమా విడుదలకి సిద్ధమవుతూ ఉండగానే, రజనీ తదుపరి సినిమా పట్టాలెక్కడానికి సన్నాహాలు జరిగిపోతున్నాయి.

'దర్బార్' తరువాత సినిమాను రజనీ తమ బ్యానర్లో చేయనున్నారంటూ సన్ పిక్చర్స్ వారు అధికారికంగా ప్రకటించారు. 'ఎంథిరన్' .. 'పేట' తరువాత సన్ పిక్చర్స్ బ్యానర్లో రజనీ చేస్తున్న మరో సినిమా ఇది. రజనీకి ఇది 168వ సినిమా. ఈ సినిమాకి శివ దర్శకత్వం వహించనున్నాడనే విషయాన్ని కూడా వాళ్లు స్పష్టం చేశారు. అజిత్ కి వరుస హిట్లు ఇస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్న శివ, ఈ సినిమాకి దర్శకుడు కావడంతో అభిమానుల్లో మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి.
Rajani
Shiva

More Telugu News